CDAC Recruitment 2021: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 259 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మొత్తం 259 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం.
బీఈ,బీటెక్, ఎం.ఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పుణెలో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఈ నెల 2వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 259 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీలు 249 ఉండగా ప్రాజెక్ట్ అసోసియేట్ల ఉద్యోగ ఖాళీలు 4, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 6 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 37 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీలకు, 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం పొందే అవకాశం ఉంటుంది.