
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 46 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఈ సంస్థ మెకానికల్, సివిల్, మైనింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ప్రొడక్షన్, హ్యూమన్ రిసోర్స్, కంపెనీ సెక్రెటరీ, రాజ్‌భాష అధికారి, లీగల్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.
జూన్ నెల 30వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా డిగ్రీ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు తాండూర్, బొకజాన్, రాజ్‌బన్ కార్పొరేట్ ఆఫీస్ లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాది కాలపరిమితికి వీరిని తీసుకోనుండగా మూడేళ్లకు పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
https://www.cciltd.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 46 ఉద్యోగ ఖాళీలలో ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 29 ఉండగా ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 17 ఉన్నాయి. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా అనుభవం ఉండటంతో పాటు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం జూన్ 30వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.