BPCL Recruitment: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఏవియేషన్) ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. ఇంజినీరింగ్ డిప్లొమా/గ్రాడ్యుయేట్ డిగ్రీ/ బీటెక్/ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో కచ్చితంగా అనుభవం ఉండాలి. 2022 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కేస్ బేస్డ్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్క్రీనింగ్, రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక జరుగుతుందని చెప్పవచ్చు.
Also Read: రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఐటీఐ అర్హతతో?
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.bharatpetroleum.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 30,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.
Also Read: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?