
BHEL Recruitment 2021: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు దేశంలోని బీహెచ్‌ఈఎల్ సైట్‌లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మొత్తం 22 ఉద్యోగ ఖాళీలలో ఇంజనీర్ (సివిల్) 7 ఉద్యోగ ఖాళీలు ఉండగా సూపర్ వైజర్ (సివిల్) 15 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీలో కచ్చితంగా పాసై ఉండాలి. సూపర్ వైజర్ (సివిల్) ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే వాళ్లు సివిల్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైం డిప్లొమా పాస్ కావడంతో పాటు సంబంధిత పనిలో అనుభవం కచ్చితంగా కలిగి ఉండాలి.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సివిల్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికవుతారో వారికి నెలకు 71,040 రూపాయలు వేతనంగా లభిస్తుంది. సూపర్ వైజర్ పోస్టుకు ఎంపికైన వాళ్లకు నెలకు 39,670 రూపాయలు వేతనంగా లభించే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://www.bhel.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సులభంగా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గత కొన్ని నెలలుగా వరుసగా రిలీజవుతున్న జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.