
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 511 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ట్రైనీ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు 15వ తేది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
https://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 511 ఉద్యోగ ఖాళీలలో ట్రైనీ ఇంజనీర్ విభాగంలో 308 ఉద్యోగ ఖాళీలు ఉండగా ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 203 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రెయినీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఫ్రెషర్ అభ్యర్థులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు తొలి ఏడాది 25,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఆ తర్వాత ఏడాదికి 3,000 రూపాయల చొప్పున వేతనం పెరుగుతుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 35,000 రూపాయల నుంచి వేతనం లభిస్తుంది. ఏడాదికి 5,000 రూపాయల వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకొవాల్సి ఉండగా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 500 రూపాయలు, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.