
ప్రముఖ కంపెనీలలో ఒకటైన బీఈసీఐఎల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్, లీగల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మే31 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://becilregistration.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 6 ఉద్యోగ ఖాళీలలో సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ 1 ఉండగా సైబర్ క్రైం ఇన్వెస్టిగేటర్ 1, సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగ ఖాళీలు 3, లీగల్ అసిస్టెంట్ ఒక ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్, ఎల్ఎల్‌బీ లేదా ఎల్ఎల్ఎం చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల కోసం ఎంపిక చేయడం జరుగుతుంది.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://becilregistration.com/ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ వరుస నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ ఆ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది.
కరోనా కష్ట కాలంలో దేశంలో చాలామంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో జాబ్ నోటిఫికేషన్ల్ ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.