
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 46 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభించనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://bdl-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 46 ఉద్యోగ ఖాళీలలో జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్) 1, డిప్యూటీ జనరల్ మేనేజర్లు 3, మెడికల్ ఆఫీసర్లు 2, మేనేజ్‌మెంట్ ట్రైనీలు(ఎలక్ట్రానిక్స్) 12, మెకానికల్ 9, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారిలో జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి లక్ష రూపాయల వేతనం, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 80,000 రూపాయల వేతనం, ఇతర ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 40,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు హైదరాబాద్, విశాఖపట్నం పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల అర్హత, అనుభవం ఉన్నవాళ్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుండటంతో నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.