
ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 31 రీసెర్చ్ అసోసియేట్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అకడమిక్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరగనుండగా మే 10వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. http://www.barc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్, ఫిజికల్ సైన్స్, థర్మల్ ప్లాస్మా, మెటీరియల్స్ సైన్స్, ఎర్త్ సైన్స్, క్రయోజెనిక్ ఇంజనీరింగ్, ఫుడ్, బయో కెమిస్ట్రీ, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ సైన్స్, , జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, డెయిరీ మైక్రోబయాలజీ విభాగాలలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ను అనుసరించి 47,000 రూపాయల నుంచి 54,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనంతో పాటు సంవత్సరానికి 40,000 రూపాయల చొప్పున కంటిజెన్సీ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వారు దరఖాస్తులను డిప్యూటీ ఎస్టాబ్లిష్ మెంట్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్ – 5, సెంట్రల్ కాంప్లెక్స్, బార్క్, ట్రాంబే, ముంబై – 400085 అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా http://www.barc.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తూ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.