https://oktelugu.com/

Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 115 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు యూనిట్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 115 ఉద్యోగ ఖాళీల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 9, 2021 / 10:58 AM IST
    Follow us on


    ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు యూనిట్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 115 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ (ఐటీ), బీఈ (ఐటీ), ఎంసీఏ/ఎంబీఏ కోర్సులు చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

    ఆఫ్‌లైన్‌ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటారో స్క్రుటిని ఆధారంగా వాళ్లను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయా రీజియన్ల ఆధారంగా దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది.

    బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి చెందిన సంబంధిత రీజియన్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. https://www.bankofbaroda.in/business-correspondent-bc-supervisors-on-contract-basis.htm వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.