
అస్సోం రైఫిల్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. రైఫిల్ మ్యాన్, రైఫిల్ ఉమెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 131 ఉద్యోగ ఖాళీలలో పురుషులకు 75 ఉద్యోగ ఖాళీలు, స్త్రీలకు 56 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ అస్సోం రైఫిల్స్ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామక ప్రక్రియను చేపడుతుండటం గమనార్హం. http://assamrifles.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన బోర్డు నుంచి పది పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
గేమ్స్ ఫర్ స్కూల్స్ నేషనల్ అవార్డ్ విజేతలు మరియు అంతర్జాతీయ, జాతీయ, అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు. క్యాండిడేట్ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
జులై 25వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా 2021 ఆగస్ట్ 24 నుంచి రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. http://assamrifles.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.