Army Recruitment: నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. ఆర్మీలో ఉద్యోగాలకు రెడీ అవ్వండి

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ఆఫీస్‌అసిస్టెంట్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులను కేటగిరీల వారీగా భర్తీ చేయనున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : May 29, 2024 4:06 pm

Army Recruitment

Follow us on

Army Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. హెడ్‌ క్వార్టర్స్‌ యూనిట్‌ కోటా కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని జూలై 8 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించనున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు.

కేటగీరీల వారీగా నియామకాలు..
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ఆఫీస్‌అసిస్టెంట్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులను కేటగిరీల వారీగా భర్తీ చేయనున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు స్పోర్ట్స్‌ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 5న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ఏవోసీ సెంటర్, థాపర్‌ స్టేడియంలో ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

స్పోర్ట్స్‌ కోటాకు వీరే అర్హులు..
ఇక స్పోర్ట్స్‌ కోటా కింద దరఖాస్తు చేసుకునేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అథ్లెటిక్‌ పోటీలో పాల్గొన్నవారే అర్హులు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నవారికి స్పోర్ట్స్‌ కోటా వర్తించదు.

వెబ్‌సైట్‌లో వివరాలు..
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా భర్తీ చేసే వివిధ కేటగిరీల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునవారు వివరాల కోసం www.joinidianarmy@nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని మిలిటరీ అధికారులు సూచించారు. అర్హతలు, శరీరదారుఢ్యం, విద్యార్హత, నిర్వహించే పరీక్షల వివరాలన్నీ ఇందులో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. ఆర్మీలో ఉద్యోగాలకు రెడీ అవ్వండి