
APSSDC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏపీ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ మేళాను నిర్వహించనుంది. ఎలైట్ ఏపీ సొల్యూషన్స్, విశాల్ మార్ట్, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ కు సంబంధించిన కుటుంబ్ కేర్ లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ముందుగా రిజిష్టర్ చేసుకోవాలి.
పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కుటుంబ్ కేర్ లో మొత్తం 26 ఉద్యోగ ఖాళీలు ఉండగా 25 ఉద్యోగ ఖాళీలు ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ విభాగంలో, ఒక ఉద్యోగ ఖాళీ టీమ్ లీడర్ విభాగంలో ఉంది. ఇంటర్ లేదా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 13,000 రూపాయల వేతనం, ఇన్సెంటివ్స్ 5,000 రూపాయలు లభిస్తాయి. టీమ్ లీడర్ విభాగానికి ఎంపికైన వారికి రూ. 25 వేల వరకు వేతనం, రూ.7 వేల ఇన్సెంటివ్స్ లభిస్తాయి. విశాల్ మార్ట్ లో అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 6 ఖాళీలు ఉండగా ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 9,000 రూపాయల వరకు వేతనం లభిస్తుందని సమాచారం.
ఎలైట్ ఏపీ సొల్యూషన్స్ లో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో 17 ఖాళీలు ఉండగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 15,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.