ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ 250 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ నోటిఫికేషన్ ద్వారా డెలివరీ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ అసిస్టెంట్ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని ప్రచారం జరుగుతోంది.
జూన్ 8వ తేదీలోగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీల కోసం రిజిష్టర్ చేసుకుంటారో వారికి జూన్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 100 ఖాళీలు ఉండగా టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్మార్ట్ ఫోన్, బైక్, టూ వీలర్ లైసెన్స్ ను కచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 13,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వేతనంతో పాటు పెట్రోల్ అలవెన్స్, మొబైల్ బిల్, ఇతర ఇన్సెంటివ్స్ పొందవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఏపీలో పని చేయాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 150 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
టెన్త్, ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More