https://oktelugu.com/

కొంకణ్ రైల్వే స్టేషన్ లో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాలలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 139 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. మొత్తం ఉద్యోగ ఖాళీలలో 87 గ్రాడ్యుయెట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 52 డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 30, 2021 / 09:17 AM IST
    Follow us on

    కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాలలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 139 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. మొత్తం ఉద్యోగ ఖాళీలలో 87 గ్రాడ్యుయెట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 52 డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    సివిల్, ఎలక్ట్రికల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2019, 2020, 2021 సంవత్సరాలలో పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్, మెకానికల్‌ విభాగాల్లో పాసైన వాళ్లు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ మార్కులను బట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    2021 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://konkanrailway.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.