APEPDCL JLM notification 2021: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 398 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. https://www.apeasternpower.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వైరింగ్ లేదా ఎలక్ట్రిక్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ విభాగంలో రెండు సంవత్సరాల వొకేషనల్ ఇంటర్మీడియట్ కోర్స్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో శ్రీకాకుళంలో 88, విజయనగరంలో 74, విశాఖపట్నంలో 71, రాజమండ్రిలో 122, ఏలూరులో 43 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 10వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాత పరీక్ష జరుగుతుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2021 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఫిజికల్ టెస్ట్ ను నిర్వహిస్తారు. 2021 సంవత్సరం నవంబర్ 15వ తేదీన ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది నవంబర్ 17వ తేదీన నియామక పత్రాలను అందజేస్తారు.
ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన ఏఈలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ నెల 1వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఓరియెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరాల్సి ఉంటుంది.