AP Tenth Class Exams 2025
AP Tenth Class Exams 2025: టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు పేపర్ లీక్ వంటివి జరగకుండా 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ ను విధించింది. ఎగ్జామ్ టైమింగ్స్ ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనుంది. టెన్త్ క్లాస్ పరీక్షల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షల కోసం 3450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ప్రారంభమయ్యాయి. ఇక ఈ ఎగ్జామ్స్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్ని కట్టుదుట్టమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈసారి టెన్త్ క్లాస్ 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా వారిలో 3,15,697 మంది అబ్బాయిలు మరియు 3,03,578 మంది అమ్మాయిలు ఉన్నారు. ఏపీ విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం అన్ని పరీక్ష కేంద్రాలకు స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది.
Also Read: శాసనమండలిలో వైసిపి క్లోజ్.. అవిశ్వాస తీర్మానం!
అలాగే విద్యాశాఖ అధికారులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సెట్టింగ్ స్క్వాడ్ మరియు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేశారు. టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ పరీక్షలు మంచిగా రాయాలి అని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలోని 163 సమస్యత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది.
అలాగే పరీక్షల నిర్వహణలో 156 ఫ్లయింగ్ స్క్వేర్ సిబ్బంది అలాగే 682 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే దూరప్రాంతాల నుంచి పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న విద్యార్థులు హాజరయ్య సమయంలో హాల్ టికెట్ పోగొట్టుకున్నా లేక మర్చిపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ అందుకోసం ఓ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ (9552300009) ను అందుబాటులోకి తెచ్చింది.