DA Hike 2025: ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 1.2 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటినుంచో డిఏ పెంపుదల వార్తలు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివిధ మీడియా కథనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఏ పెంపును ఆమోదించవచ్చు అని తెలుస్తుంది. ఈ నెలాఖరులోపు కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డి ఏ ను పెంచే అవకాశం ఉంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇది 53% నుండి 55 శాతానికి చేరుకోనుంది. ఇప్పటికే వినిపిస్తున్న కొన్ని మీడియా కథనాలు ప్రకారం రాబోయే బుధవారం రోజు క్యాబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు అని తెలుస్తుంది. బుధవారం రోజు ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం 1.2 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు కరువు భత్యం పెంపుదలను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ద్రవయోల్బన రేటుకు అనుగుణంగా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం అలాగే పెన్షనర్లకు కరువు ఉపశమనం ఇవ్వబడుతుంది.
Also Read: శాసనమండలిలో వైసిపి క్లోజ్.. అవిశ్వాస తీర్మానం!
కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డి ఏ పెంపును ప్రకటించబోతుంది అంటూ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఎంట్రీ లెవెల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి. రూ.18000 వేలు జీతం పొందే ఉద్యోగులకు నెలకు రూ.360 పెరగనుంది. ఇది జనవరి 1, 2025 నుంచి అమలులోకి రానుందని తెలుస్తుంది. ప్రస్తుతం 18000 మూలవేతను పొందుతున్న ఒక ఉద్యోగికి రూ.9540(53 శాతం) డి ఏ లభిస్తుంది. రెండు శాతం డి ఏ పెరుగుదల ఆ వ్యక్తి డి ఏ ను రూ.9900 పెంచుతుంది.
ఈ విధంగా చూసుకుంటే అతని జీవితం నేలకు రు. 360 పెరుగుతుంది. అదే కనుక మూడు శాతం డి ఎ పెరుగుదల ఉంటే రూ.9540 పెరుగుతుంది. దీని ఫలితంగా ఆ వ్యక్తి జీవితం రూ.540 పెరుగుతుంది. చివరి డీఏ పెంపు జనవరి 1, 2024లో అమలులోకి వచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా వారి కరువు ఉపశమనంలో ఇదే విధమైన పెరుగుదలను చూస్తారు.