ఏపీలో 10.143 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఖాళీల వివరాలివే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 10,143 ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జులై నెల నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటన చేస్తోంది. తాజాగా ప్రభుత్వం […]

Written By: Navya, Updated On : June 18, 2021 4:09 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 10,143 ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జులై నెల నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటన చేస్తోంది.

తాజాగా ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ విడుదలైంది. పోలీసు, విద్యా, వైద్య శాఖల్లో పోస్టుల వివరాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను ఈ జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. మొత్తం 10,143 ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టులు – 1238 ఉన్నాయి. 2021 జులై నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టులు 36 ఉండగా 2021 ఆగష్టులో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

పోలీస్‌ శాఖ ఉద్యోగ ఖాళీలు 450 ఉండగా 2021 సెప్టెంబర్ లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 451 ఉండగా ఈ ఏడాది అక్టోబర్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. పారామెడికల్‌ సిబ్బంది – 5,251 పోస్టులకు ఈ ఏడాది నవంబర్ లో నర్సులు- 441 పోస్టులకు ఈ ఏడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

వచ్చే ఏడాది జనవరిలో డిగ్రీ కాలేజీల లెక్చరర్లు – 240 పోస్టులకు ఫిబ్రవరిలో వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు – 2,000 పోస్టులకు ఇతర శాఖల్లో 36 పోస్టులకు నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.