Prabhas: ప్రస్తుతం ఉన్న సూపర్ స్టార్స్ లో ప్రభాస్ జోరు ఏ స్థాయిలో ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఆయన వేగం ముందు ఇతర హీరోలు నిలబడలేకపోతున్నారు. మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ ఒక్కో పాన్ ఇండియన్ సినిమా చెయ్యడానికి ఏళ్ళ తరబడి సమయాన్ని తీసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను విడుదల చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను రాబడుతూ ఇండియా లో తనకి మించిన సూపర్ స్టార్ ఎవ్వరూ లేరని నిరూపించుకున్నాడు. ఈ ఏడాది ఆయన కల్కి చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా ప్రభావం ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద తగ్గలేదు, ఇంతలోపే ప్రభాస్ మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు. ‘సీతారామం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఒక పీరియాడికల్ సబ్జెక్టు ని సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘Fouji’ అనే వర్కింగ్ టైటిల్ ని ఖరారు చేసారు. నేడు ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ ఓపెనింగ్ హైదరాబాద్ లోని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ లో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రం ‘రజాకార్’ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి, పాకిస్థానీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథ గా డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్టు తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటిది ఇంత సరికొత్త ఆలోచనతో, గుండెలను హత్తుకునే ప్రేమకథతో ప్రభాస్ ఈ సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఊహించుకోవచ్చు.
The DAWN of an Epic Saga Of War, Justice and Beyond ❤️
Looking forward to having all the love & support as always
Thankful to Rebelstar #Prabhas Garu & @MythriOfficial :)))#PrabhasHanu begins ❤️
To another magical film and a memorable journey with the most special people… pic.twitter.com/jq2o7uOwTD— Hanu Raghavapudi (@hanurpudi) August 17, 2024
ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో వెయ్యి కోట్ల సినిమాలు దాటినవి చాలానే ఉన్నాయి కానీ, ఒక్క సినిమా కూడా బాహుబలి 2 ఫుల్ రన్ కలెక్షన్స్ ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం పర్ఫెక్ట్ గా తీస్తే బాహుబలి 2 ఫుల్ రన్ వసూళ్లను అధిగమిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ నెలలోనే మొదటి షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, 14 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన చిన్న కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఇకపోతే ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ‘రాజా సాబ్’ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున విడుదల కానుంది. వచ్చే ఏడాది లోనే ‘Fouji’ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
When wars were a battle for supremacy, ONE WARRIOR redefined what they were FOUGHT for ❤️#PrabhasHanu, a HISTORICAL FICTION set in the 1940s
Shoot begins soon
Rebel Star #Prabhas @hanurpudi #Imanvi #MithunChakraborty #JayaPrada @Composer_Vishal @kk_lyricist… pic.twitter.com/GsT5Ll3xIl
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024