AMD Recruitment 2021: అటోమిక్ మినరల్స్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 124 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ పరిధిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. సైంటిఫిక్ అసిస్టెంట్-బి, టెక్నీషియన్ – బి, అప్పర్ డివిజ్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది. వేర్వేరు విభాగాలలో వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో పాసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో ఖచ్చితంగా అనుభవం ఉండాలి. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 18,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. స్కిల్ టెస్ట్ / రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎటువంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులకు ఉద్యోగ ఖాళీలకు బట్టి దరఖాస్తు ఫీజు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది.
2021 సంవత్సరం నవంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.amd.gov.in/app16/index.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.