Job Mela in Guntur: దేశంలో నిరుద్యోగ యువకుల సంఖ్య లక్షల్లో ఉంది. నిరుద్యోగులలో చాలామంది డిగ్రీ పూర్తి చేసి మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా గుంటూరులో భారీ జాబ్‌మేళాను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన గుంటూరు జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరగనుంది. జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గా బాయి మాట్లాడుతూ 6 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని తెలిపారు.
18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్డు కార్డు, రెజ్యూమేతో హాజరు కావాల్సి ఉంటుంది. 0863 – 2350060 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. www.nec.gov.in వెబ్ పోర్టల్ ద్వారా కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ వెబ్ సైట్ లో ఆన్ లైన్ జాబ్ సీకర్ గా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా రిజిష్టర్ చేసుకోవడం సాధ్యం కాకపోతే డైరెక్టర్ గా ఉపాధి కార్యాలయ ప్రాంగణం, గుజ్జనగుండ్లకు హాజరు కావాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్లు ఈ జాబ్ మేళాకు హాజరైతే ప్రయోజనం చేకూరుతుంది.
కాల్ చేయడం, వెబ్ సైట్ ద్వారా ఈ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.