https://oktelugu.com/

Jobs :సికింద్రాబాద్‌ రైల్వేలో 81 జూనియర్‌ ఇంజినీర్‌ జాబ్స్.. భారీ వేతనంతో?

Jobs :సికింద్రాబాద్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. నవంబర్ 17వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2021 11:56 am
    Follow us on

    Jobs :సికింద్రాబాద్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. నవంబర్ 17వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    Jobs

    Jobs

    సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు సికింద్రాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఓబీసీ ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 47 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read: Jobs : ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.80 వేలకు పైగా వేతనంతో?

    2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి ఈ వయస్సు ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://203.153.33.92/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్స్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని సమాచారం.

    ఈ ఉద్యోగ ఖాళీలకు నిరుద్యోగులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: AP Govt Jobs: ఏపీలో 1317 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. మంచి జీతంతో?