ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..? 

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పే ఫిక్సేషన్ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయగా ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కొన్ని రోజుల క్రితం టాక్స్ విషయంలో కేంద్రం గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేంద్రం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే నిర్ణయం తీసుకుంది.   కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి ఉద్యోగులు […]

Written By: Navya, Updated On : May 4, 2021 9:56 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పే ఫిక్సేషన్ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయగా ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కొన్ని రోజుల క్రితం టాక్స్ విషయంలో కేంద్రం గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేంద్రం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే నిర్ణయం తీసుకుంది.

 

కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పే ఫిక్సేషన్ గుడువను మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలపగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రానికి డెడ్‌లైన్ పొడిగించాలని రిక్వెస్ట్ చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి తేదీ ఆధారంగా స్థిర చెల్లింపు పొందాలా? లేదా ఇంక్రిమెంట్ తేదీ ఆధారంగా స్థిర చెల్లింపు పొందాలా? అనే విషయం నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది.

 

అయితే ఉద్యోగులకు కేంద్రం మరోసారి గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం గమనార్హం. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు జూలై 1 నుంచి అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏను పెండింగ్‌లో పెట్టగా ఆ మూడు డీఏలను ఒకేసారి చెల్లించనుండటం గమనార్హం. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల డీఏ పెరగనుంది.

 

కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ఉద్యోగుల డీఏ ఏకంగా 28 శాతానికి చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం అందిస్తున్న తీపికబురుల వల్ల చాలామంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.