IIT REcruitment: ఖరగ్‌పూర్ ఐఐటీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 7 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులుఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెస్సీ, బీటెక్/ఎంటెక్/ఎంఈ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 28 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నిరుద్యోగ అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 34,000 రూపాయల వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులైన వాళ్లు http://www.iitkgp.ac.in/temporary-jobs వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: బీటెక్, ఎంసీఏ విద్యార్థులకు శుభవార్త.. 111 ఉద్యోగ ఖాళీలు!
డిసెంబర్ నెల 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు అర్హత్లతో పాటు నెట్/గేట్ అర్హత సాధించి ఉండాలి. వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో నిరుద్యోగులకు మేలు జరగనుంది.
Also Read: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?