Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ బోర్డ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 691 జూనియర్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.9,300 నుంచి 34,800 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు 4200 రూపాయలు గ్రేడ్ పే చెల్లించడం జరుగుతుంది. రాత పరీక్ష (టైర్-1, టైర్-2) ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://dsssb.delhi.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం గమనార్హం.