ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. 3,393 కాంట్రాక్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. కాంట్రాక్ట్ పద్ధతిలో రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
https://cfw.ap.nic.in/mlhp2021.html వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అకాడమిక్ మెరిట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
2021 సంవత్సరం నవంబర్ 6వ తేదీలోపు అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ మార్కులను బట్టి ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొదట కాంట్రాక్ట్ విధానంలో ఏడాది పాటు ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఆ తర్వాత పనితీరును బట్టి బాగా పని చేసేవాళ్లను కొనసాగించడం జరుగుతుంది. అర్హత ఉన్న నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.