Jobs: ఈఎస్‌ఐసీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనంతో?

Jobs: ఎంప్లాయిూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ 311 ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 2, 2022 3:55 pm
Follow us on

Jobs: ఎంప్లాయిూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ 311 ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టులతో పాటు జూనియర్‌ రెసిడెంట్ పోస్టులు (బ్రాడ్‌ స్పెషాలిటీ), సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు (బ్రాడ్‌ స్పెషాలిటీ), సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సూపర్ స్పెషలిస్టు పోస్టులు, జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు, స్పెషాలిటీ స్పెషలిస్టు పోస్టులు, జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్ 2021 ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ, మెడికల్‌ పీజీ/పీజీ డిప్లొమా/ఎండీ/ఎంఎస్‌/పీహెచ్‌డీ పాసై అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

esic.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 60,000ల నుంచి 2,80,254 వరకు వేతనంగా చెల్లిస్తారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు, అర్హత ఉన్న ఉద్యోగులకు మేలు జరుగుతోంది.