
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాలలో ఖాళీగా ఉన్న 22 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. ఎన్‌ఐఆర్‌డీపీఆర్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, రిసెర్చ్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం. ఎవరైతే ఆసక్తి, అర్హతను కలిగి ఉంటారో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 22వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. http://nirdpr.org.in/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 22 ఉద్యోగాలలో అసోసియేట్ స్ట్రాటజిక్ మేనేజర్లు 4, రిసెర్చ్ అసోసియేట్ 3, రిసెర్చ్ అసిస్టెంట్ 2, సీనియర్ కన్సల్టెంట్ 2, ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ స్పెషలిస్ట్ 1, ఐఈసీ అండ్ ఎక్యుమెంటేషన్ ఎక్స్‌పర్ట్ 1 ఖాళీలు ఉన్నాయి.
ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్‌ఆర్‌ఎం 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐసీటీ 1, ఈటీఎల్ టూల్ స్పెషలిస్ట్ 1, ప్రోగ్రామ్ ఆఫీసర్ 1, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ 1, ప్రాజెక్ట్ ట్రైనింగ్ మేనేజర్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ (ఎంఐఎస్) – 1 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పీజీ, డిగ్రీ, బీఈ లేదా బీటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ, డిప్లొమా చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా జూన్ నెల 22వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.