https://oktelugu.com/

Jobs: బీటెక్ పాసైన విద్యార్థులకు తీపికబురు.. భారీ వేతనంతో 500 ఉద్యోగ ఖాళీలు!

Jobs: ఇంజనీరింగ్ పాసైన విద్యార్థులకు ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ తీపికబురు అందించింది. 500 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెల 1వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 1, 2022 / 09:30 PM IST
    Follow us on

    Jobs: ఇంజనీరింగ్ పాసైన విద్యార్థులకు ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ తీపికబురు అందించింది. 500 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెల 1వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

    nlcinida.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ఈఈఈ ఉద్యోగ ఖాళీలు 70, ఈసీఈ ఉద్యోగ ఖాళీలు 10, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 10, సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 35, మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 75, సీ.ఎస్.ఈ ఉద్యోగ ఖాళీలు 20, కెమికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 10, మైనింగ్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 20 ఉన్నాయి.

    ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. డిప్లొమా అప్రెంటీస్ ఈఈఈ ఉద్యోగ ఖాళీలు 85, సివిల్ ఉద్యోగ ఖాళీలు 35, మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 90, సీ.ఎస్.ఈ ఉద్యోగ ఖాళీలు 25, ఫార్మసీ ఉద్యోగ ఖాళీలు 15 ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ నైవేలి అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

    కుల ధృవీకరణ పత్రంతో పాటు సెమిస్టర్ వారీగా మార్క్ షీట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టేషన్ ఫారంపై సంతకం చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.