https://oktelugu.com/

Jobs: ప్రముఖ సంస్థలో 20 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి తీపికబురు అందించింది. నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆడిట్‌ ఆఫీసర్, అకౌంటెంట్, ఇంటర్నల్‌ ఆడిటర్‌ కమ్‌ అడ్వైజర్, ప్రోగ్రామర్, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. మేనేజర్‌ సిస్టమ్స్, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2022 / 11:50 AM IST
    Follow us on

    Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి తీపికబురు అందించింది. నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆడిట్‌ ఆఫీసర్, అకౌంటెంట్, ఇంటర్నల్‌ ఆడిటర్‌ కమ్‌ అడ్వైజర్, ప్రోగ్రామర్, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.

    మేనేజర్‌ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, మేనేజర్‌ అకడమిక్‌ సిస్టమ్స్, లైబ్రరీ ఆఫీసర్, అకౌంట్స్‌ ఆఫీసర్ పోస్టులను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, ఎంఈ/ఎంటెక్‌ పాసై అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2022 సంవత్సరం జనవరి 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు, అనుభవం ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరుతోంది. https://www.nitie.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.