ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. అమరరాజా సంస్థలో 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. నవంబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిష్టర్ చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిష్టర్ చేసుకుంటారో వాళ్లు ఈ నెల 20వ తేదీన తంబళ్లపల్లెలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. పది, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన వాళ్లకు 50 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇంటర్ పాసైన వాళ్లకు 50 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 7500 రూపాయల నుంచి 10, 846 రూపాయల వరకు వేతనం లభించనుంది.
18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉన్నారు. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. చిత్తూరులోని అమర రాజా గ్రూప్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రాయితీపై భోజన సదుపాయంతో పాటు వసతిని రాయితీపై పొందవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. https://apssdc.in/industryplacements/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: 100 job vacancies in amaraja company ten with inter qualification
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com