https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టీసీఎస్ సంస్థ..?

దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడంతో నిరుద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్ల కోసం, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో కొలువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గత కొన్ని నెలలుగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటమే తప్ప కొత్త నియామకాలను చేపట్టడం లేదు. అయితే తాజాగా నిరుద్యోగులకు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టీసీఎస్ శుభవార్త […]

Written By: Kusuma Aggunna, Updated On : September 27, 2020 7:47 pm
Follow us on

tcs conducting exam recruiting freshers

దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడంతో నిరుద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్ల కోసం, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో కొలువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గత కొన్ని నెలలుగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటమే తప్ప కొత్త నియామకాలను చేపట్టడం లేదు.

అయితే తాజాగా నిరుద్యోగులకు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టీసీఎస్ శుభవార్త చెప్పింది. నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్ పేరుతో టీసీఎస్ అభ్యర్థుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహిస్తోంది. టీసీఎస్ అర్హత పరీక్షలను నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. గడిచిన మూడేళ్లుగా ఐటీ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షను టీసీఎస్ నిర్వహిస్తోంది.

టీసీఎస్‌ అయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంగుస్వామి రామస్వామి మాట్లాడుతూ ఈ పరీక్షలో మెరుగైన స్కోర్ సాధించిన వారికి సులభంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని.. ఈ పరీక్ష స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుని ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నాయని వెల్లడించారు. కంపెనీలు అభ్యర్థుల నుంచి ఆశించే నైపుణ్యాలకు సంబంధించి ఇందులో ప్రశ్నలు ఉంటాయని అన్నారు.

ఎన్‌క్యూటీ పరీక్షకు బీటెక్, ఎంటెక్, డిగ్రీ కోర్సులు చదివిన వాళ్లు, 2019 – 2020 సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకసారి పరీక్ష రాసి మెరుగైన స్కోర్ సాధించిన అభ్యర్థులకు రెండు సంవత్సరాల వరకు కంపెనీలు ఆ స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ స్కోర్ ద్వారా త్వరగా ఉద్యోగం లభించే అవకాశం ఉండటంతో వేల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.