https://oktelugu.com/

Mumbai Billioneers: బిలియనీర్ల అడ్డాగా మారిన ముంబై.. హురూన్ నివేదిక ప్రకారం ఇక్కడ ఎంత మంది ఉన్నారంటే?

ఈ సంవత్సరం ముంబైలో 26 మంది బిలియనీర్లు పెరిగారు. ఇదే సమయంలో చైనాలో 18 మంది బిలియనీర్లను కోల్పోయింది. ముంబైలో మొత్తం బిలయనీర్ల సంపద 47 శాతం పెరిగి 445 బిలియన్ డాలర్లకు చేరకుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 26, 2024 / 11:29 AM IST

    Mumbai Bilianeer In Worldwide

    Follow us on

    Mumbai Billioneers: భారత్ లో కుబేరుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎంతలా అంటే చైనాలోని బీజింగ్ ను దాటేసేంత. ఒకప్పుడు నగరాల్లో ఎక్కువగా ఉండే బిలయనీర్ల విషయంలో ఇప్పుడు భారత్ లోని ముంబై దూసుకుపోతుంది. మనోళ్లు సంపదను సృష్టించడంలో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొత్త కంపెనీలు ప్రారంభిస్తారు. మరో వైపు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ఆదాయం విపరీతంగా పెరిగుతోంది. తాజాగా హురూన్ రీసెర్చ్ ప్రకారం చైనాలో బీజింగ్ కంటే భారత్ లోని ముంబైలోనే బిలియనీర్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

    హురూన్ తాజాగా రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ను బయటపెట్టింది. దీని ప్రకారం ప్రపంచంలో 2024 సంవత్సరంలో అత్యధికంగా బిలియనీర్లు ఉన్న నగరం అమెరికాలోని న్యూయార్క్ ఉంది. ఇక్కడ 119 మంది బిలియనీర్లతో మొదటిస్థానంలో ఉండగా.. 97 మందితో లండన్ రెండో స్థానంలో ఉండేది. ముంబై 92 స్థానంతో మూడో స్థానంలోకి వచ్చింది. చైనాలో 91 బిలియనీర్లు ఉన్నారు.

    ఈ సంవత్సరం ముంబైలో 26 మంది బిలియనీర్లు పెరిగారు. ఇదే సమయంలో చైనాలో 18 మంది బిలియనీర్లను కోల్పోయింది. ముంబైలో మొత్తం బిలయనీర్ల సంపద 47 శాతం పెరిగి 445 బిలియన్ డాలర్లకు చేరకుంది. భారత్ కరెన్సీ ప్రకారం రూ.37 లక్షల కోట్లకు పైమాటే. బిజీంగ్ సంపద 28 శాతానికి పడిపోయి 265 డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీ ప్రకారం రూ.22 లక్షల కోట్లు. గతంలో ఉన్న చైనా స్థానాన్ని భారత్ ఈ ఏడాది ఆక్రమించింది.

    భారత బిలియనీర్లలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలుస్తారు. ఫార్మాష్యూటికల్ రంగంలో ఎక్కువగా సంపదను సృష్టించారు. అలాగే రియల్ ఎస్టేట్ దిగ్గజం మంగళ్ ప్రభాత్ లో ధాదే ఆదాయం 116 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా బిలియనీర్లలో అసియాలో ముంబై నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.