Job problems: ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరి ఎంత కాలం పనిచేస్తారు..? అంటే ఒకప్పుడు తన జీవితాంతం ఒకే సంస్థలో ఉండేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో యువత ఒక సంస్థలో ఉండాలంటే ఇష్టపడడం లేదు. తన కెరీర్ కు అనుగుణంగా ఉద్యోగాలను మారుస్తూ పైకి ఎదుగుతున్నాయి. అయితే ఇలా ఒక ఉద్యోగి ఎక్కువ కాలం ఒకే సంస్థలో ఉండడం మంచిదేనా..? తన కెరీర్ కు అనుగుణంగా సంస్థలు మారడం కరెక్టెనా..? అనే చర్చ సాగుతోంది. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలం పాటు ఉద్యోగం చేస్తానంటేనే రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఉద్యోగికి లాభమా..? లేక కంపెనీలకు లాభమా..? అనేది ఆసక్తిగా మారింది.
ఉద్యోగాల విషయంలో ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తోంది. కొత్త కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా ఒక ఉద్యోగిని రిక్రూట్ మెంట్ చేసుకునేటప్పుడే తాను సంవత్సరం పాటు సంస్థలో పనిచేయాలి అనే నిబంధన ఉంటుంది. కానీ ఈ నిబంధన ఇప్పుడు వర్తిస్తుందా..? ఉద్యోగి చేస్తున్న జాబ్ నచ్చినా.. నచ్చకపోయినా సంవత్సరం పాటు అందులో ఉండడం అనేది సాధారణంగా పెట్టుకునే నియమం. అయితే మహమ్మారి కాలంలో ఉద్యోగాలు, పనివేళలు, కార్యాలయాల్లో ఊహించని రీతిలో మార్పులు వచ్చాయి. అయితే ఈ సమయంలో నియమం వర్తిస్తుందా..?
కంపెనీల వైపు నుంచి చూస్తే ఒక ఉద్యోగి ఏడాది పాటైనా ఉద్యోగంలో ఉంటే అతనిని రిక్రూట్ మెంట్ చేసుకోవడం వృథా ప్రయాసే అవుతుందని అంటున్నారు. అయితే ఉద్యోగి వైపు నుంచే చూసేత ఒక ఏడాది పాటు స్థిరంగా ఉద్యోగం చేయడం అనేది పని పట్ల వారికి ఉన్న విధేయతను సూచిస్తుంది. అయితే 12 నెలలు నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునే అవకాశం లభిస్తుంది. అయితే కెరీర్ ను నిర్మించుకునే విధానంలో వస్తున్న మార్పులకు మహమ్మారి తోడై ఉద్యోగాల్లో మార్పు తీసుకొచ్చింది.
ఎక్కువకాలం ఉ్యదోగం చేసేవారి కోసం యజమానులు చూస్తున్నప్పటికీ కెరీర్లో ఒకటి, రెండు సార్లు ఏడాది కన్నా తక్కువ కాలంలో ఉద్యోగాలలు మారిపోయిన వారిని పెద్దగా తప్పుబట్టనక్కర్లేదు. అలా మారడానికి తగిన కారణాలు వివరిస్తే దాన్నోలోపంగా పరిగణించక్కర్లేదని అంటున్నారు. సంవత్సరం దాటిన తరువాత ఉద్యోగుల పనితీరును గమనిస్తారు. అలాగే తమ బృందంలో ఎవరు ఎలాంటి వాల్లన్నది కూడా వారికి ఓ అవగాహన వస్తుంది. సంస్థలో ప్రభావం చూపడానికి , కొత్తనైపుణ్ాలను నేర్చుకోవడానికి, వారు ఎలా ఎదిగారో చూపించడానికి ఒక సంవత్సరం పడుతుంది.
Also Read: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ కి పంపించారా.. వెంటనే ఇలా చేయండి?
కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నప్పుడు పాత ఉద్యోగంలో ఏడాది పాటు ఏమేమి చేశారో చెప్పేందుకు కావలసినంత పరుకు మీ దగ్గర సమకూరుతుంది. తదుపరి ఉద్యోగానికి మీరు అర్హులు అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ఏడాది కాలం పాటు మీరు పడిన శ్రమ సహకరిస్తుంది. అని ప్రముఖ జాబ్ సైట్స్ తెలుపుతున్నాయి. అయితే ఉద్యోగుల్లో నిబద్ధత లేకపోవడం, నిలకడలేనితనం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదగడానికి ప్రయత్నించుకపోవం, టీమ్ బృందాల్లో ఉన్నప్పుడు వదిలిపోవడం లాంటి లక్షణాలు వేగంగా ఉద్యోగాలు మారేవారిలో కనిపిస్తూ ఉంటాయి.
ఇక ఒక సంవత్సరం లోపే ఉద్యోగం వదిలి వెళ్లిపోయేవారిపై సంస్థలు కూడా బోలెడంత టైమ్, డబ్బు ఖర్చు పెట్టాలని అనుకోవు. గత ఉద్యోగాల్లో నిలకడ లేని వారిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఇష్టపడరు. చేస్తున్న ఉద్యోగం గురించి మీకు ఎన్ని సందేహాలున్నా.. కనీసం ఒక ఏడాది పాటు అందులో ఉండడం మేలు అని అంటున్నారు. ముందు తరాల వారు తమ కెరీర్లో ఎక్కువ భాగం ఒకే సంస్థలో గడిపేవారు, కానీ ప్రస్ుతతం తరం అలా ఆలోచించట్లేదు అని బోస్టన్లోని మేనేజ్మెంట్ తెలుపుతోంది.
Also Read: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.. ఒక్కొక్కరికి ఏకంగా రూ.6 లక్షలు!