Gold Price Today: వారం రోజులుగా పెరిగి ఆందోళన కలిగించిన బంగారం ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2160 డాలర్లుగా ఉంది. సిల్వల్ 25.08 డాలర్ల వద్ధ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినా.. దేశీయంగా మాత్రం తగ్గడంతో కాస్త ఊరట లభించింది.
బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 19న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,380గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.65,870 గా ఉంది. మార్చి18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,590తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.210 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,520ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,010గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,370 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.65,860 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60,890 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,430తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.370 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,860తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,370తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,860తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,900గా నమోదైంది.సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.300 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,900గా ఉంది. ముంబైలో రూ..76,900, చెన్నైలో రూ.79,900, బెంగుళూరులో 75,900, హైదరాబాద్ లో రూ.79,900తో విక్రయిస్తున్నారు.