US Presidential Building: ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో జనజీవనం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడి ప్రభుత్వం కూడా అంతేస్థాయిలో ప్రజా పాలన చేస్తోంది. అమెరికాలో పాలన వ్యవస్థ అంతా అధ్యక్షుడి నివాస భవనం అయిన వైట్ హౌస్ నుంచే సాగుతుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పాలకులు మారుతున్నా వైట్ హౌస్ వ్యవస్థ ఒకేలాగా కొనసాగుతుంది. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న వైట్ హౌస్ పై ఇప్పటి వరకు చాలా సార్లు దాడులు జరిగాయి. దీంతో టెక్నాలజీని పెంచుకుంటూ వైట్ హౌస్ ను కాపాడుతూ వస్తున్నారు. అయితే వైట్ హౌస్ లో సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడానికి ఏడు పద్ధతులను అవలంభిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
-బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్:
వైట్ హౌజ్లో మొత్తం 132 బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసెస్ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఏ రూంలో ఉన్నాడో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ప్రతీ రూంకి విండో ప్యానల్ ఉంటుంది. ఎందుకంటే నాచురల్ లైట్ రూంలోకి రావాలని ఇలా ఏర్పాటు చేశారు. అయితే ఏ క్షణంలోనైనా దాడి జరిగే ప్రమాదం ఉన్నందున వాటిని బుల్లెట్ ఫ్రూఫ్ తో తయారు చేశారు. ఇవి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ మాత్రమే కాదు.. బెల్లాస్టిక్ గ్లాస్ తో తయారు చేయబడ్డాయి. ఈ సెక్యూరిటీ గురించి చాలా పకడ్బందీగా ఉంటారు. కానీ 2011 నవంబర్ 2వ తేదీన ఆస్కార్ రమీరా అనే వ్యక్తి వైట్ హౌజ్ పై దాడి చేశారు. ఆ సమయంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే బెలాస్టిక్ గ్లాస్ అయినందున బుల్లెట్ లోపలికి వెళ్లలేదు.
-ఇన్ ఫ్రాడ్ సెన్సార్:
సినిమాల్లో చూసిన విధంగా వైట్ హౌజ్లోను ఇలాంటివి ఏర్పాటు చేశారు. వైట్ హౌజ్ లోకి వెళ్లిని ప్రతి వ్యక్తిని ఈ సెన్సార్ స్కాన్ చేస్తుంది. ఒక చిన్న జీవి కూడా తప్పుగా ఇక్కడ తిరిగితే సెక్యూరి సిస్టం వాల్లకు వెంటనే సమాచారం అందుతుంది.
-సర్ఫేస్ట్ ఏయిర్ మిస్సైల్:
వైట్ హౌజ్లో ఎలాంటి మిస్సైల్స్ కనిపించవు. ఏ వ్యక్తి అయినా వైట్ హౌజ్ లోకి రాంగ్ గా అడుగుపెడితే సెక్యూరిటీ సిస్టం వాళ్లకు వెంటనే ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇవి ఆకాశంలో నుంచి వస్తున్న దాడులను వెంటనే పసిగట్టగలదు. అక్కడి నుంచి తమకు వ్యతరేకంగా మిస్సైల్స్ వస్తే వెంటనే ఇవి కాల్చివేస్తాయి. ఈ ఏరియా మొత్తం నో ఫ్లై జోన్ గా ఏర్పాటు చేశారు. అంటే ఈ చుట్టు పక్కల ఏ ఫ్లైట్ కనిపించినా వెంటనే కాల్చివేయబడుతుంది.
Also Read: SS Rajamouli: మహేష్ తో నేను అలాంటి రిస్క్ చెయ్యలేను
-ఫుడ్ టెస్టర్:
పాత కాలంలో రాజులు తాము ఫుడ్ ను తినేముందు కొంతమందికి పెట్టేవారు. ఎందుకంటే ఇందులో పాయిజన్ ఉన్న విషయం ఆ రాజుకు ముందే తెలిసిపోవాలని. ఇక్కడా అలాగే ఫుడ్ టెస్టర్ ను ఏర్పాటు చేశారు. ముందుగా సెక్యూరిటీ సిస్టం ఫుడ్ టెస్ట్ చేసిన తరువాతే ప్రెసిడెంట్ కు ఇస్తారు. ఒకవేళ అధ్యక్షుడికి ఫాస్ట్ ఫుడ్ ని తినాలనిపిస్తే.. ఆ ఆర్డర్ ను వేరే అడ్రస్ కు పంపిస్తారు. అక్కడ టెస్ట్ చేసిన తరువాత వైట్ హౌజ్ కు తీసుకువస్తారు.
-గార్డ్ డాగ్స్:
వైట్ హౌజ్లో ప్రెసిడెంట్ ను కాపాడేందుకు గార్డ్ డాగ్స్ ఉంటాయి. 1975 నుంచి వీటిని ఏర్పాటు చేశారు. ఈ డాగ్స్ అన్నీ బెల్జియం దేశానికి చెందినవి. ఈ డాగ్స్ పిల్లలను ఏం చేయవు. కానీ ఎవరైనా ఫెన్సింగ్ దాటి వచ్చారో.. ఇక ఆ డాగ్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎవరినైనా చేజ్ చేయగల సత్తా వీటికి ఉంటుంది.
-ఐరన్ ఫెన్స్:
సాధారణంగా భవనాలు నిర్మిస్తే చుట్టుపక్కలా ఇటుక, కాంక్రీట్ తో ప్రహారీ ఏర్పాటు చేస్తారు. కానీ వైట్ హౌజ్ కు ఇప్పటి వరకు అలాంటి నిర్మాణం చేయలేదు. చుట్టూ ఐరన్ తో చేసిన ప్రహారి ఉంటుంది. ఎందుకంటే వైట్ హైస్ ను జనాలు చూడాలని. అయితే వైట్ హౌజ్ ఫెన్స్ ను దాటడానికి కొంతమంది ట్రై చేశారు. 2018 వరకు వైట్ హైజ్ ఫెన్స్ హైట్ 6.6 ఫీట్లు ఉండేది. కానీ ఆ తరువాత 10 ఫీట్లు చేశారు. ఎవరైనా దీనిని దాటాలని ట్రై చేస్తే వెంటనే తెలిసిపోతుంది.
డ్రోన్ సెక్యూరిటీ:
2015లో డ్రోన్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ డ్రోన్స్ వైట్ హైజ్ సమీపంలో నిత్యం సంచరిస్తూ ఉంటాయి. సరౌండింగ్లో ఏం జరిగినా ఈ డ్రోన్స్ వెంటనే సెక్యూరిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది.
ఇంతటి పటిష్ట భద్రత మధ్య అమెరికా అధ్యక్షుడు ఈ వైట్ హౌస్ లో భద్రంగా ఉంటారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యాధినేత ఉండే ఈ భవనంలో ఇంతటి భద్రతతోపాటు బయటకు చెప్పని చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి.
Also Read: Telangana Govt Jobs Notification: నిరుద్యోగుల్లారా ఇది మీకోసమే.. నోటిఫికేషన్లు వచ్చేది అప్పుడే