Chiranjeevi Birthday Special: తెలుగు సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా వెలిగిపోతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. నేడు మెగాస్టార్ పుట్టినరోజు. దాంతో తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మెగాస్టార్ బర్త్ డే విషెస్ తో దద్దరిల్లిపోతుంది. తెలుగు సినిమాను శ్వాసించి శాసిస్తున్న చిరు జర్నీనే ఓ అఖండ విజయం. అసలు చిరంజీవి గురించి ఎంత చెప్పినా అభిమానులకు ఆ అభిమాన దాహం తీరదు. అయినా ఒక్క మాటలో చెప్పాలంటే.. చిరు కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో. చిరు అంటేనే ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం, హీరో అవ్వాలని ఆశ పడే అతి సాధారణ కుర్రాళ్లకు నిజమైన ఆదర్శం. అన్నిటికీ మించి ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే ఏకైక హీరో.. మన చిరంజీవి .
నిజానికి ఇప్పటికీ తెలుగులో మెగాస్టార్ గా రారాజుగా వెలిగిపోతున్నా.. ఎన్నడూ గర్వం చూపని సినీ కార్మిక హీరో చిరు. అయితే ఆయనకు ఈ స్థాయి అంత సులభంగా ఏం రాలేదు. కెరీర్ మొదట్లో చిరుకి హీరోగా అసలు గుర్తింపే రాలేదు. అయినా చిరు నిరుత్సాహ పడలేదు. విలన్ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. చివరకు తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయిన అసలు సిసలు హీరో అనిపించుకున్నాడు. ఇక్కడ ఒక విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సొంతంగా హీరో అయినవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ, తన కుటుంబం నుంచి డజను మందిని హీరోలను చేసిన ఘనత ఒక్క చిరంజీవికే దక్కుతుంది. ఈ ఘనత మహా నటుడు ఎన్టీఆర్ కే సాధ్యం కాలేదు.
Also Read: NTR- Amit Shah: టీడీపీ, ఎల్లో మీడియాలో కలకలం రేపుతోన్న జూనియర్ ఎన్టీఆర్
అందుకే మెగాస్టార్ అంటే.. తెలుగు సినిమా స్థితని, గతిని మార్చిన ఒక శక్తి, అందుకే, చిరంజీవికి భారత రత్న ఇవ్వాలని ఈ పుట్టినరోజు నాడు అభిమానులు కొత్త నినాదం అందుకున్నారు. అయినా తన సినీ కెరీర్ లో చిరు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే ఎన్నో గొప్ప బిరుదులు వచ్చినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు. తనకు ప్రజల అభిమానమే నిజమైన అవార్డు అని చిరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే చిరంజీవిని తెలుగు ప్రజలు తమ హృదయాల్లో శాశ్వతంగా బంగారు ముద్ర రూపంలో భద్రపరుచుకున్నారు. తమ గుండెల నిండా చిరు పై అభిమానాన్ని నింపుకున్నారు. ఆయనకు భారతరత్న వచ్చినా రాకపోయినా ఆయనెప్పుడూ రత్నమే.
అయితే, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో చిరును గౌరవించి సత్కరించింది. ఇక చిరంజీవి తన సినీ ప్రస్థానంలో దాదాపు 30 వరకూ అవార్డులను అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. పైగా ప్రజాక్షేమంలో, సమాజశ్రేయస్సులో కూడా ఆయనకు ఆయనే సాటి. అలాగే ప్రజల పట్ల చూపించే ఆప్యాయతలో కూడా చిరంజీవి ఎంతో ప్రశంసనీయుడు.
కాబట్టి.. మెగాస్టార్ చిరంజీవి ఈ పుట్టిన రోజును మరింత సంతోషంగా జరుపుకోవాలని, ఆయన ఇలాగే మరెన్నో దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు మా ఓకే తెలుగు తరుపున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Also Read: God Father Teaser: ‘గాడ్ ఫాదర్’ టీజర్ టాక్: ‘గాడ్ ఫాదర్’ చిరంజీవితో కలిసి సల్మాన్ ఖాన్ చింపేశాడు!
Recommended Videos