China loans : చైనా రుణం అంటే ఎందుకంత భయం..: అప్పు ఇచ్చిన తరువాత ఏం చేస్తుంది..?

China loans .. burden to poor countries : కుట్రలు, కుతంత్రాల చైనా ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి మరో వ్యూహం రచిస్తోంది. మధ్య ఆదాయ దేశాలకు రుణాలు ఇస్తూ, వాటిని తీర్చలేని స్థితిలో వడ్డీలను విధిస్తుంది. దీంతో కొన్ని దేశాలు చైనా ఇచ్చిన రుణాలను తీర్చలేక ఆ దేశం చేసే ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోంది. ఇలాంటి వికృత చర్యల్లో శ్రీలంక దేశం బలైందని బ్రిటిష్ నిఘా సంస్థ ఆరోపించింది. వందల కోట్ల అప్పులను ఆశగా చూపి […]

Written By: NARESH, Updated On : January 8, 2022 12:58 pm
Follow us on

China loans .. burden to poor countries : కుట్రలు, కుతంత్రాల చైనా ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి మరో వ్యూహం రచిస్తోంది. మధ్య ఆదాయ దేశాలకు రుణాలు ఇస్తూ, వాటిని తీర్చలేని స్థితిలో వడ్డీలను విధిస్తుంది. దీంతో కొన్ని దేశాలు చైనా ఇచ్చిన రుణాలను తీర్చలేక ఆ దేశం చేసే ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోంది. ఇలాంటి వికృత చర్యల్లో శ్రీలంక దేశం బలైందని బ్రిటిష్ నిఘా సంస్థ ఆరోపించింది. వందల కోట్ల అప్పులను ఆశగా చూపి ఆ తరువాత ఆస్తులపై నియంత్రణ చేయడమే చైనా చేస్తున్న కొత్త వ్యూహం. అయితే ఈ ఆరోపణలను చైనా తిరస్కరిస్తోంది. తమ పరపతిని దెబ్బతీయడానికి పశ్చిమదేశాలు అనవసర ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. తమ వల్ల నష్టపోయిన దేశం గురించి చెప్పండంటూ.. సవాల్ విసురుతోంది.

ప్రపంచంలోని రుణదాతల దేశాల్లో చైనా ఒకటి. గత పదేళ్లలో చైనా ఇతర దేశాలకు 170 బిలియన్ డాలర్ల రుణాలను ఇచ్చింది. అయితే అధికారికంగా చెప్పిన ఈ మొత్తం తక్కవేనని, అనధికారికంగా ఎక్కువే రుణాలు ఇచ్చి ఉంటుందని ఆరోపిస్తున్నారు. చైనా ఇతర దేశాలకు ఇచ్చే చాలా వరకు అప్పులు రికార్డుల్లో నమోదు కావని అమెరికాకు చెందిన వలియం అండ్ మేరీ యూనివర్సిటీకి చెందిన ఎడిడ్ డేటా పరిశోధనలో తేలింది. ఇప్పటి వరకు చైనా 40కి పైగా అల్ఫాదాయ, మధ్యాదాయ దేశాలకు రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది. చైనా ఇచ్చిన రుణాలు ఆయా దేశాల వార్షిక జీడీపీకి 10 శాతానికి మించిపోయాయి. బిబౌటీ, లావోస్, జాంబియా, కిర్గిజ్ స్తాన్ దేశాల్లో చైనా రుణాలు వాటి వార్షిక జీడీపీలో 20 శాతానికి మించిపోయాయి.

అయితే ఇతర దేశాలపై చైనా పెత్తనం సాధించేందుకే రుణాల రూపంలో చేరువవుతుందని బ్రిటిష్ ఎంఐ6 అధిపతి తెలిపారు. చైనా ఇతర దేశాలకు అప్పులు ఇస్తుంది. అవి నియంత్రణ కోల్పోవాల్సి వస్తుందనిపించినప్పుడు వాటి ఆస్తులను చేజిక్కించుకుంటుందని అంటున్నారు. ఇందులో భాగంగా శ్రీలంక దేశంపై చైనా చేసిన ఆధిపత్యమే ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నారు. శ్రీలంక దేశం చైనా నుంచి తీసుకున్న రుణాలకు బదులుగా ప్రభుత్వ నిర్వహణలోని పోర్టులో చైనా వ్యాపారులకు 70 శాతం నియంత్రణను 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. దీంతో ఈ పోర్టు ప్రాజెక్టును ‘అప్పుల ఉచ్చు’ అని కొందరు ఆరోపిస్తున్నారు. కాగా శ్రీలంక తీసుకున్న ఎక్కువ రుణాలు చైనాయేతరవే. కానీ పోర్టు నుంచి వ్యూహాత్మక సైనిక ప్రయోజనాల్ని పొందడం కోసం ఇలాంటి ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తోంది.

చైనా నుంచి రుణాలు తీసుకున్న దేశాలు ఎక్కడా చెప్పవు. అలాంటి ఒప్పందాన్ని ముందే రుణం తీసుకున్న దేశాలతో చేసుకుంటుంది. చైనా కూడా విదేశాలకు అప్పుడు ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించరు. కానీ ప్రముఖ పారిశ్రామిక దేశాల్లో చాలా వరకు రుణ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ‘పారిస్ క్లబ్’అని పిలిచే సభ్యత్వం ద్వారా వెల్లడిస్తాయి. చైనా ఈ గ్రూపులో చేరకూడదని నిర్ణయించుకుంది. అయితే అందుబాటులో ఉన్న వరల్డ్ బ్యాంకు డేటాను పరిశీలిస్తే మిగతా దేశాల కన్నా చైనా ఇచ్చిన రుణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మిగతా దేశాలతో పోలిస్తే చైనా రుణాలు చాలా కష్టం. ఎందుకంటే వార్షిక వడ్డీని ఈ దేశం 4 శాతం వసూలు చేస్తుంది. మిగతా దేశాల కంటే ఇది 4 రేట్లు ఎక్కువ. ఇక అప్పుల్ని తీర్చే గడువు   పదేళ్లకన్నా తక్కువే ఉంటుంది. ఇతర రుణదాత దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు రాయితీలపైన ఇచ్చే రుణాలు తీర్చేందుకు దాదాపు 28 ఏళ్ల గడువు విధిస్తాయి. అయితే రుణ గ్రహీతలు ఏదైనా విదేశీ అకౌంట్లో మినిమమ్ క్యాష్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాలని చైనా ప్రభుత్వ కార్యాలయ అధికారులు కోరుతారు. అలా రెండు వైపులా బుక్ చేస్తూ పేద దేశాలను బలి చేసి వారి ఆస్తులను కొల్లగొట్టే ఎత్తుగడను చైనా చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.