Baby Movie Heroine Friend: సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలని చాలా మంది యువతులు ప్రయత్నిస్తుంటారు. ఒకప్పుడు నేరుగా ఇండస్ట్రీకి కొన్ని ఫైళ్లను పట్టుకొచ్చి అవకాశాల కోసం ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిభను చాటుతూ షైన్ అవుతున్నారు. అలా ఫేమస్ అయిన వారు సినిమాల్లో హీరోయిన్ గా రాణించినవారు చాలా మందే ఉన్నారు. లేటేస్టుగా ఓ అమ్మాయి ఓ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించి ఆకట్టుకుంది. హీరోయిన్ లెవల్లో ఉన్నా ఆమెను చూసి చాలా మంది ఫ్యూచర్లో మంచి భవిష్యత్ ఉంటుందని కొనియాడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే?
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘బేబీ’ మూవీ జూలై 14న రిలీజ్ అయింది. సాయి రాజేష్ డైరెక్షన్లో వచ్చిన ఇందులో ఆనంద్ దేవరకొండతో పాటు విరాజ్ అశ్విన్ అనే మరో హీరో నటించారు. అలాగే వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ఆమెకు స్నేహితురాలిగా ఓ అమ్మాయి నటించింది. ఈమె పేరు కుసుమ డేగలమర్రి. సినీ ఇండస్ట్రీకి కుసుమ డేగల మర్రి కొత్త కావొచ్చు. కానీ యూట్యూబ్ లో ఆమె సుపరిచితురాలే. ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ పెట్టిన కుసుమ చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ స్పూఫ్ అనే వీడియోలో కనిపించి ఆకట్టుకున్నారు.
కుసుమ నటించింది మొదటి సినిమా అయినా ఆమె గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో 12 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన వీడియోలను పోస్టు చేస్తూ ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. అయితే కుసుమ త్వరలో హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతుందని, స్టార్ హీరోయిన్ కూడా అవుతారని కొందరు ఆమె ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. అయితే కుసుమ ఈ కామెంట్లను పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఎంతో మంది ఇలా సోషల్ మీడియా ద్వారా సినిమాల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు కుసుమ కూడా అలాగే అలరిస్తుందని అంటున్నారు. హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉన్న ఈమె లేటేస్టు ఫొటోలు చూసి ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Do you know who is the girl who acted as heroines friend in the movie baby what is her background
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com