400 Years House: 400 ఏళ్ల కట్టడం ఏది అంటే.. మనం చదువుకున్న పుస్తకాల ప్రకారం చార్మినార్ అంటాం. దాదాపు ఈ విషయం చదువుకున్న అందరికీ తెలుసు. కానీ, అంతటి సీనియారిటీ ఓ ఇల్లుకు ఉంది. నిర్మించి 400 ఏళ్లు అయినా.. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఠీవీ, రాజసం ఏమత్రం తగ్గలేదు. 30 అడుగుల ఎత్తులో కట్టిన ఈ ఇంటిని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.
ఐదు తరాలు చూసిన గృహం..
400 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు.. ఐదు తరాలవారు చూసిన ఇల్లు అది. రాజసం ఉట్టిపడుతున్న ఈ ఇంటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి యచూపుతున్నారు. ఇంతకీ ఈ ఇలు్ల ఎక్కడ ఉందో చెప్పలేదు కదూ.. రంగారెడ్డి జిల్లా మునుపల్లి గ్రామంలో ఈ పురాతనమైన ఇల్లు ఉంది. ఈ పురాతన ఇంటిని చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. జిల్లా వాసులు మునుపల్లి వైపు వెళ్తే తప్పకుండా ఆ ఇంటిని సందర్శిస్తారట. నాడు ఆ ఇంట్లో యజమానులతోపాట కూలీలు, పాలేర్లు, వారి కుటుంబ సభ్యులు కలిసే ఉండేవారని మునుపల్లి పెద్దలు చెబుతారు.
ప్రత్యేకత ఇదీ..
మునుపల్లిలోని 400 ఏళ్లనాటి ఇంటికి ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఇంట్లో 75 గదులు ఉన్నాయి. 101 ద్వారాలతో దీనిని నిర్మించారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఇంటిని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అప్పట్లో 200 మంది కూలీలు ఈ ఇంటి నిర్మాణం కోసం పనిచేసి ఉంటారని పురావస్తు శాఖ అంచనా వేసింది.
కూలీలకు పని కల్పించాలని..
సుమారు 17వ శతాబ్దంలో నాటి జమీందారు సంగప్ప పాటిల్ దీనిని నిర్మించారు. కరువుతో ఇక్కడి ప్రజలు అల్లాడుతున్న సమయంలో వారికి ఉపాధి కల్పించేందుకు ఈ ఇంటి నిర్మాణం చేపట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఇంటిని తాము ఇంకెక్కడా చూడలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇంతటి పురాతనమైన ఇలు్ల తమ మునుపల్లిలో ఉండడం సంతోషంగా ఉందంటునా్నరు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Do you know how a house is still intact for 400 years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com