Bhupalpally Crime News: ఇటీవల భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం వడితల గ్రామంలో 22 సంవత్సరాల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. ఆమె చుట్టూ క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసుల వివరాలు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు తెలిసాయి.. అంతేకాదు ఇదంతా కూడా ఒక క్రైమ్ సినిమాను మించిపోయింది.
భూపాలపల్లి జిల్లా వడిదల గ్రామంలో కవిత, భర్త, 22 సంవత్సరాల కుమార్తెతో నివాసం ఉంటున్నది. ఈమెకి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అది కాస్త భర్తకు తెలిసింది. అయితే అప్పటికే అతడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాగోదని భావించి జూన్ 25న ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఆ తర్వాత వ్యాధితో అతడు చనిపోయాడని నమ్మించింది. అతడికి పక్షవాతం ఉండడంతో బంధువులు కూడా ఆమె చెప్పిన మాటలు నమ్మారు. దీంతో అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. భర్త చనిపోయిన తర్వాత ఆమె మరింత ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తన సంబంధం గురించి కూతురికి తెలుస్తుందని భయపడింది. కవిత కూతురు వయసు 22 సంవత్సరాలు. ఆమె పేరు వర్షిణి. ప్రియుడుతో కలిసి ఇటీవల తన కూతుర్ని హత మార్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని భూపాలపల్లి, కాటారం హైవే పక్కన అడవిలో పడేసింది. చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లింది. పక్కనే ఆధార్ కార్డు కూడా పెట్టింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురు కనిపించడం లేదని విలపించింది.
తన కూతురు మృతదేహం ఉన్నట్టు ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో మహానటి లెవెల్ లో యాక్టింగ్ చేసింది. ఆ యువతి మృతదేహం వద్ద నిమ్మకాయలు.. కుంకుమ.. ఇతర వస్తువులు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కవితను తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నిజం ఒప్పుకుంది. సరిగ్గా రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది. కుమార్తెను కూడా అతడి సహాయంతోనే చంపినట్టు వెల్లడించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచినట్టు వెల్లడించింది. అంతేకాదు మరో హత్యకు కూడా ప్లాన్ చేసినట్టు కవిత వెల్లడించింది. అయితే వారు హత్య చేయాలనుకున్న వ్యక్తి ఎవరనే విషయం మాత్రం పోలీసులు బయటికి చెప్పడం లేదు. కవితను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.