UP Crime News: చాటు మాటు సంబంధాలు, అనైతిక కార్యకలాపాలు ఎప్పటికైనా డేంజరే. వాస్తవానికి ఇటువంటి బంధాలు సంసార జీవితానికి ఇబ్బందికరంగా మారుతుంటాయి. అనుకొని దారుణాలకు కారణమవుతుంటాయి. అయినప్పటికీ ఇటువంటి బంధాలను కొంతమంది వదులుకోలేరు. చివరికి ఇలాంటి బంధాల వల్ల దారుణాలు జరుగుతుంటాయి. ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. అనైతిక బంధానికి అలవాటు పడిన ఓ ఇన్స్పెక్టర్ చివరికి తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్ రాయ్ అలా ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి విధి నిర్వహణలో అరుణ్ కుమార్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో కఠినమైన కేసులను ఆయన పరిష్కరించారు. ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి అరుణ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్ అధికారులకు దిగ్భ్రాంతి కలిగించింది.. అరుణ్ కుమార్ ఎందుకు చనిపోయారు.. బలవంతంగా చనిపోవాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దర్యాప్తులో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అరుణ్ కుమార్ మీనాక్షి శర్మ అనే మహిళ కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. అరుణ్ కుమార్ కు గతంలోని వివాహం జరిగినట్టు తెలుస్తోంది.. మీనాక్షితో అతడు ప్రేమ సంబంధాన్ని కొనసాగించాడు. వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీనాక్షి ఆ వీడియోలను తన ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ తర్వాత అతడిని బెదిరించడం మొదలుపెట్టింది.. అంతేకాదు తాను పెళ్లి చేసుకోబోతున్నానని, 25 లక్షల వరకు ఇవ్వాలని అతడిని డిమాండ్ చేసింది.. అంత డబ్బు తాను ఇవ్వలేనని అరుణ్ కుమార్ పేర్కొన్నాడు. అయితే మీనాక్షి ఎంతకు తగ్గలేదు. పైగా తనకు ఆ డబ్బు ఇవ్వాల్సిందేనని పట్టు పట్టింది. పలుమార్లు అతడితో ఫోన్ కాల్స్ కూడా చేసింది.. మీనాక్షి శర్మ నుంచి ఒత్తిడి అధికంగా ఉండడంతో అరుణ్ కుమార్ తట్టుకోలేకపోయాడు. చివరికి తన సర్విస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మీనాక్షి శర్మ పై గతంలో ఒక అత్యాచారం కేసు కూడా నమోదయింది..ఓ యువకుడికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. అతనితో ఏకాంతంలో ఉన్నప్పుడు వీడియోలు తీసింది. వాటిని బయట పెడతానని బెదిరించింది. దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదయింది.. ఆ తర్వాత కొంతకాలానికి మీనాక్షి పై అధికారులతో మేనేజ్ చేయించుకొని మళ్ళీ డ్యూటీలోకి ఎక్కింది. డ్యూటీలోకి ఎక్కిన తర్వాత మళ్లీ తన బాగోతం మొదలుపెట్టింది. చివరికి ప్రేమ పేరుతో ఒక ఇన్స్పెక్టర్ ను బలి తీసుకుంది.