Husband Abuse Cases India: ఒకవైపు నదిని చూస్తున్న భర్తను నీళ్లలోకి తోసేసిన భార్య.. మరోవైపు నిద్రపోతున్న భర్త ముఖంపై మరిగే నీళ్లు పోసిన భార్య.. ఇలా ఎటు చూసినా ఈమధ్య భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో తెలియదు కానీ బాధితులు భర్తలే అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల చాలామంది ఆడవారు ఇలా చేయడానికి కారణాలు ఏంటోనని కొందరు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. గతంలో ఎక్కువగా ఆడవారిపై దాడులు జరిగేవి. వారి రక్షణ కోసం అనేక ఆందోళనలు నిర్వహించారు. కానీ ఇప్పుడు భర్తలపై జరుగుతున్న దాడులపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి?
Also Read: భారత్ నిజంగా ‘డెడ్ ఎకానమీ’నా?
కాలం మారుతున్న కొద్దీ మనుషుల మనస్తత్వాలు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సంబంధాలకు ఎక్కువగా విలువ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే డబ్బు విషయం కూడా పట్టించుకోని కొందరు చిన్నచిన్న విషయాలకే పెద్దగా ఐరానా పడిపోతున్నారు. అందుకు సామాజిక పరిస్థితులే కారణం అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. నేటి కాలం లేడీస్ లో ఓపిక అనేది లేకుండా పోయిందని.. దీంతో ప్రతి విషయాన్ని ఆలోచించకుండానే చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.
ఉదాహరణకు ఒక ఇంట్లో ఒక వస్తువు కొనుగోలు చేయాలని భార్య అనుకుంటుంది. కానీ దానికి వెచ్చించే డబ్బులపై భర్త ఆలోచిస్తున్నాడు. ఇలా తన వద్ద లేని కారణంగా ఆ వస్తువు కొనుగోలు చేసేందుకు వాయిదా వేస్తున్నాడు. అయితే ఈ విషయంలో కొంతమందికి ఓపిక లేకపోవుగా.. ఆ వస్తువు కొనుగోలు చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీస్తుంది. అయితే ఇక్కడ బాధితురాలు తనే అని భావించి భార్య కోపం కట్టలు తెంచుకుంటుంది. దీంతో భర్త పై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అంటున్నారు.
సోషల్ మీడియా ప్రభావం మనుషులపై తీవ్రంగా చూపిస్తుంది. ప్రస్తుతం దాదాపు ప్రతి మహిళా చేతులో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండి. మీరు ప్రతిరోజు ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి యాప్ లలో ఉండే కొన్ని నెగటివ్ వీడియోలను చూస్తున్నారు. ఇందులో పరిస్థితులు తమ వే అనుకొని భావించి సినిమాలలో చూపించే విధంగా ప్రవర్తిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు భర్త కంటే భార్యదే పై చేయి అన్నట్టు చూపించడంతో.. నిజజీవితంలో కూడా అలాగే ఉంటుందని భావించి తమ పెత్తనం కోసం పోరాటాలు చేస్తున్నారు.
Also Read: మీ పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉన్నారా?
కొందరు ఆడవాళ్లు ఇంట్లో పెరిగిన పరిస్థితుల వాతావరణంతోనూ ఇలా తయారవుతున్నట్టు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. తమ చిన్నప్పటి నుంచి ఘర్షణ వాతావరణం లో పెరిగితే.. వారు కూడా పెద్దయ్యాక అలాగే మారుతున్నారని అంటున్నారు. తమ ఇంట్లో అమ్మానాన్నలు ఎప్పుడూ గొడవ పడేవారు ఉంటే వారు కూడా గొడవ పెట్టుకోవాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ విషయంలో మగవారు ఈ మధ్య ఆడవారిపై దాడి చేయడానికి ముందుకు రావడం లేదు. కానీ ఆడవారు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా దాడి చేయడానికి వెనుకాడడం లేదు. ఇందుకు వారిలో ఉన్న మానసిక పరిస్థితులే కారణమని తెలుస్తోంది.