Hyderabad: ఇటీవల హైదరాబాదులో ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని కర్ణాటకలో కాల్చివేశారు.. దీనిపై పోలీసులు విచారణ జరపగా దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరానికి చెందిన రమేష్ ఓ వ్యాపారవేత్త. ఈయనకు నిహారిక అనే భార్య ఉంది. ఈమె స్వస్థలం యాదాద్రి జిల్లా. రమేష్ కు దాదాపు 8 కోట్లు విలువైన వ్యాపార సంస్థలున్నాయి… అయితే నిహారిక కు డాక్టర్ నిఖిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే వారిద్దరి వ్యవహారం రమేష్ కు తెలిసింది. దీంతో భార్యను నిలదీయగా.. ఆమె ఎదురు సమాధానం చెప్పింది. దీంతో వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. అతడు ఉండగా తాము కలిసి ఉండలేమని భావించి.. రమేష్ ను అడ్డు తొలగించుకోవాలని నిహారిక, నిఖిల్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అతడిని ఇటీవల భవనగిరి ప్రాంతంలో హత్య చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని బెంజ్ కారు లో హైదరాబాద్ నుంచి కర్ణాటక వరకు తీసుకెళ్లారు. అక్కడ హర్యానా రాష్ట్రానికి చెందిన రాణా వ్యక్తి సహాయంతో ఊటీ దాకా తీసుకెళ్లారు. అక్కడ ఒక కాఫీ ఎస్టేట్ లో రమేష్ మృతదేహాన్ని కాల్చారు. అయితే అక్కడ పనిచేసే కూలీలు మృతదేహాన్ని కాల్చిన ఆనవాళ్ళు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్ణాటక పోలీసులు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టారు. దీంతో అసలు విషయాలు వెలుగు చూస్తాయి.
ఆస్తి కోసమే చంపిందట?!
వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న నిహారిక.. తన భర్త ఆస్తి 8 కోట్ల కోసమే చంపినట్టు పోలీసుల విచారణలో పేర్కొంది. మరోవైపు డాక్టర్ నిఖిల్ కూడా ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని కర్ణాటకలో కాఫీ ఎస్టేట్ కు తరలించి.. అక్కడ తగలబెట్టడానికి సహాయం చేసిన రాణాను హర్యానాలో ఓ దాబాలో టీ తాగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే ఈ ఘటన వెనుక మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. తమ విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కర్ణాటక పోలీసులు తెలంగాణకు వచ్చారు. యాదాద్రి జిల్లాలో విచారణ కొనసాగిస్తున్నారు. నిహారిక ఉదంతం వెలుగులోకి రావడంతో ఆమె తల్లిదండ్రులు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. కాగా, రమేష్ ను ఎలా చంపారు? దీని వెనుక ఎవరున్నారు? నిహారిక – నిఖిల్ వ్యవహారం తెలిసి కూడా రమేష్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఇన్ని కోణాలలో పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మరి కొద్ది రోజుల్లో ఈ కేసు కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక పోలీసులకు తెలంగాణ పోలీసులు కూడా సహకరిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Wife murders businessman husband in hyderabad burns body in ooty coffee estate for property
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com