Husband Catches Wife: వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి ద్వారా చోటుచేసుకునే అనర్ధాలు కూడా ఎక్కువవుతున్నాయి. అయినప్పటికీ ఎవరూ మారడం లేదు. మారే ప్రయత్నం కూడా చేయడం లేదు.. ఒకవేళ తమ సంబంధాలకు అడ్డుగా ఉండాలని భావిస్తే భర్తలను భార్యలు.. భార్యలను భర్తలు అంతం చేస్తున్నారు. చివరికి చట్టానికి చిక్కి జైలు పాలవుతున్నారు. కన్న పిల్లల్ని అనాధలు చేసి.. సమాజ దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకొని తలవంచుకుంటున్నారు. ఈతరహా సంఘటనలో ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తున్నప్పటికీ.. పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ తరహా కేసులను చేదిస్తున్నప్పటికీ ఎవరిలోనూ పెద్దగా మార్పు రావడం లేదు. అందువల్లే సమాజంలో పెడ పోకడలు చోటు చేసుకుంటున్నాయి..
తమిళనాడులోని కళ్ళ కురిచి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.. వీరిద్దరికి చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ భార్య మరొక వ్యక్తికి దగ్గర అయింది.. అతనితో సరసల్లాపాలలో మునిగి తేలడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో భార్య వ్యవహారం ఇటీవల ఆ భర్తకు తెలిసింది. దీనిపై అతడు ఆమెను నిలదీశాడు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ఊరుకోలేదు. పైగా మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టింది. భర్తను దూరం పెట్టింది. ఇది అతడికి ఏమాత్రం నచ్చలేదు. భార్య ప్రవర్తనతో విసిగి వేసారి పోయిన అతడు ఇక లాభం లేదనుకున్నాడు. సరైన సమయం కోసం అతడు ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఆరోజు రానే వచ్చింది.
సరిగ్గా ఆరోజు అతడు బయటికి వెళ్ళాడు. వేరే పనిలో అతడు నిమగ్నమయ్యాడు. ఆ పని పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చాడు. తలుపు గడియ పెట్టి ఉంది. ఎంత కొట్టినా సరే తన భార్య తలుపు తీయలేదు. దీంతో కిటికీ నుంచి చూసాడు. అతడు చూడకూడని దృశ్యం కనిపించింది. తన భార్య, ఆమె ప్రియుడు సల్లపాలలో మునిగి తేలుతున్నారు. తట్టుకోలేకపోయిన అతడు తలుపు గడియను బలవంతంగా తీశాడు. అతడి అలికిడి విన్న వారిద్దరూ దుస్తులు ధరించారు. అప్పటికే పట్టరాని కోపంతో ఉన్న ఆ భర్త మూలకు ఉన్న కత్తితో వారిద్దరిని తెగ నరికాడు. ఆ తర్వాత వారిద్దరి తలలను మొండాల నుంచి వేరు చేశాడు. ఆ తలలు తీసుకొని నేరుగా వెల్లూరు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోయాడు. అక్కడ లొంగిపోయాడు. తలు పట్టుకున్న అతనిని చూసిన పోలీసులు ఒక్కసారి గా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆ తలలతో నిందితుడి ఇంటికి వెళ్లారు. ఆ తలలను మొండాలతో సరిపోల్చారు. అవి రెండు మ్యాచ్ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.