Wanaparthy Crime News: అగ్నిసాక్షిగా వారిద్దరూ ఏడడుగులు వేశారు. బంధువుల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. కలకాలం కలిసి ఉంటామని భాసలు చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్నారు. నీకు నేను.. నాకు నువ్వు అని పాటలు పాడుకున్నారు. ఆనందంగా సాగుతున్న వారి సంసారంలో ఒక్కసారి స్పీడ్ బ్రేక్ వేసినట్టు కలహాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో.. ఆ కుటుంబం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
వనపర్తి నగరంలో గణేష్ నగర్ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో నాగమణి, కురు మూర్తి అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. కురు మూర్తి వనపర్తి ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ లో వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈనెల 28న అతడు కనిపించడం లేదని సోదరి చెన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ మొదలుపెట్టారు. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో పోలీసులకు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలిసాయి.
కురు మూర్తి భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో అతడిని తామే హత్య చేశామని వారిద్దరు అంగీకరించారు. పథకం ప్రకారం కురు మూర్తి ని చంపేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓ ప్రైవేటు ట్రావెల్స్ వద్దకు వెళ్లాడు. కారును సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత కురు మూర్తి కారులో పెట్టుకొని శ్రీశైలం డ్యాంలో పడేశారు. ఈ వ్యవహారాన్ని మొత్తం పోలీసుల విచారణలో వారిద్దరు వెల్లడించడంతో.. పోలీసులు వారిద్దరిని రిమాండ్ కు తరలించారు.
కురు మూర్తి తన భార్య నాగమణిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడని.. కానీ ఆమె మాత్రం ప్రియుడి మోజులో ఉండేదని స్థానికులు అంటున్నారు. అనేక పర్యాయాలు అతడు ఇంటికి వచ్చాడని.. ఆమెతో సరస సల్లాపాలలో మునిగి తేలేవాడని స్థానికులు అంటున్నారు. ఇదంతా తెలిసినప్పటికీ భార్య మీద ప్రేమతో కురు మూర్తి ఏమి అనలేకపోయేవాడని.. చివరికి అతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నాగమణి అంతం చేసిందని చుట్టుపక్కల వారు వివరిస్తున్నారు.