Homeక్రైమ్‌valentines day incident : లవర్ తో కలిసి వాలంటైన్స్ డే..తన భార్యను ఈ భర్త...

valentines day incident : లవర్ తో కలిసి వాలంటైన్స్ డే..తన భార్యను ఈ భర్త ఎలా పట్టుకున్నాడు అంటే?

valentines day incident : భార్య ఉండగానే ఇంకొక మహిళతో.. భర్త ఉండగానే ఇంకొక వ్యక్తితో . సంబంధాలు కొనసాగించడం.. అవసరమైతే తమ భాగస్వాములను వదిలేసి.. వేరే వాళ్ళతో వెళ్లిపోవడం.. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. కొందరైతే తమ జీవిత భాగస్వాముల ద్వారా పిల్లలు కలిగినప్పటికీ.. వారందరిని వదిలిపెట్టి కొత్త పరిచయాల ద్వారా దగ్గరైన వ్యక్తులతో వెళ్ళిపోతున్నారు ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు కూడా ఉన్నారు.

అనైతికమైన సంబంధాలకు అలవాటు పడి అసలు వారిని దూరం చేసుకుంటున్నారు. పైగా దారుణమైన నిర్ణయాలు తీసుకొని.. క్రూరమైన నేరాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల సమాజం అనేది హీనస్థితికి చేరిపోతుంది. విలువలు మొత్తం అడుగంటిపోయి.. మనుషుల మధ్య బంధాలు దూరమవుతున్నాయి. ప్రేమ అనేది కాలగర్భంలో కలిసిపోయి.. శరీర వాంఛలకే ప్రథమ ప్రాధాన్యమనే దిక్కుమాలిన సూత్రం మననం లో ఉంటున్నది.

భర్తలను దూరం పెడుతూ.. ఇతర వ్యక్తులకు దగ్గరవుతున్న భార్యల తాలుకూ ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. వారు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్న ఉదంతాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి వాటి వల్ల దారుణాలు జరుగుతున్నప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో ఘోరాలు జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు గతంలో అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. ఇప్పుడు మాత్రం రోజుకో తీరుగా ఆ తరహా దారుణాలు మీడియా ద్వారా మనకు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే మరింత విచిత్రంగా దర్శనమిస్తున్నాయి.

తాజాగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాను మాత్రమే కాదు .. ప్రధాన మీడియాను సైతం షేక్ చేసింది. ఆ సంఘటన సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు దర్శనంగా నిలిచింది . ఓ మహిళకు గతంలో పెళ్లయింది . అయితే ఆమెకు అంతకుముందే ఒక ప్రియుడు ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు ఒత్తిడి తీసుకురావడంతో ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త మీద ఆమె ఏదో ఒక రకంగా పై చెయ్యి సాధిస్తూనే ఉంది. అతడిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. కారణం లేకుండానే అతనిపై గొడవలకు దిగుతోంది. ప్రియుడి మీద మోజుతో ఇటీవల భర్తపై కేసులు పెట్టింది. ఆ కేసులు అలా కొనసాగుతుండగానే ప్రియుడితో సరసాలు ఆడటం మొదలుపెట్టింది.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను పురస్కరించుకొని తన ప్రియుడితో ఏకాంతంగా గడపడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆమెను నిలదీశాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. “నా ఇష్టం.. నాకు నచ్చిన వ్యక్తితోనే నేను ఉంటాను . నువ్వంటే ఏమాత్రం ఆసక్తి లేదు. అలాంటప్పుడు నీతో నేను కాపురం చేయలేను. నీతో నాకు విడాకులు కావాలి. అందుకే కేసులు పెట్టాను. ఏం చేస్తావో చేసుకో పో అంటూ” పోలీసుల ముందే ఆ భర్తకు షాక్ ఇచ్చింది. దీంతో దిగ్బ్రాంతికి గురి కావడం ఆ భర్త వంతయింది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఇంత జరుగుతున్నా సరే వారు ఏమీ చేయలే ని పరిస్థితి. ఆడవాళ్ళు తెగిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. ఈ ఘటన నిరూపిస్తోంది. అలాగే అమాయకపు భర్తలు ఉంటే.. వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో.. ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular