Homeక్రైమ్‌Bhadradri Kothagudem: డబ్బు, ఆశ.. వివాహేతర సంబంధాలు.. స్వాతి హత్య కేసులో ఊహించని దారుణ కోణాలు...

Bhadradri Kothagudem: డబ్బు, ఆశ.. వివాహేతర సంబంధాలు.. స్వాతి హత్య కేసులో ఊహించని దారుణ కోణాలు ఇవి..

Bhadradri Kothagudem: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండాలో స్వాతి (32) అనే మహిళ దారుణ హత్యకు గురికావడం సంచలనాన్ని కలిగించింది. స్వాతిని ఆమె ప్రియుడు దారుణంగా హతమార్చి.. ముక్కలుగా చేసి పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ వ్యవహారంలో దారుణమైన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. స్వాతి కష్టపడకుండా డబ్బును సంపాదించాలనే ఆశతో పలువురితో వివాహేతర సంబంధాలు నడపడం మొదలుపెట్టిందని తెలుస్తోంది. చివరికి ఆ వివాహేతర సంబంధాలకే ఆమె బలైపోయిందని స్థానికులు అంటున్నారు. స్వాతి స్వస్థలం మణుగూరు మండలం తోగూడెం. ఆమెకు గతంలోనే సాంబ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే అతడు చనిపోయాడు. ఈ క్రమంలో స్వాతి కొత్తగూడెం వచ్చింది. బతుకుదెరువు నిమిత్తం స్కూల్లో ఆయాగా పనిచేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం మానేసి కొత్తగూడెంలోని ఒక షాపింగ్ మాల్ లో పనికి కుదిరింది. అక్కడ ఆమెకు జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన రత్నకుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. రత్నకుమార్ దగ్గర డబ్బు ఉండడంతో.. దానిని కొట్టేయాలని భావించింది..” నా తండ్రికి సింగరేణి ఉద్యోగం ఉంది. నువ్వు కనుక 16 లక్షలు ఇస్తే వారసత్వ ఉద్యోగం ఇప్పిస్తానని” స్వాతి రత్నకుమార్ తో నమ్మబలికింది. దీంతో రత్నకుమార్ స్వాతి చెప్పినట్టుగా 16 లక్షలు ఇచ్చాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగ రాకపోవడంతో రత్నకుమార్, ఆయన భార్య పార్వతి స్వాతిని నిలదీశారు. దీంతో స్వాతి రత్నకుమార్ కు ఒక షరతు విధించింది. ” నేను వీరభద్రం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం అతని ఇంట్లోనే ఉంటున్నాను. అతని భార్య నందిని నువ్వు చంపేస్తే నీ 16 లక్షలు నీకు ఇచ్చేస్తానని” స్వాతి రత్న కుమార్ కు చెప్పింది. ఇంట్లో భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో రత్నకుమార్ దానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న తన తలకు హెల్మెట్ ధరించి.. రత్నకుమార్ మాచినేనిపేట తండా వెళ్ళాడు. అక్కడ వీరభద్రం సతీమణి నందిని పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడింది. అయితే ఈ విషయం బయటకు తెలుస్తుందని భావించి సెప్టెంబర్ 29న రత్నకుమార్, అతని భార్య పార్వతి పురుగుల మందు తాగారు. అయితే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వారిద్దరు మృతిచెందడంతో సాయిరాం తండాకు చెందిన గ్రామస్తులు పంచాయతీ పెట్టి పది లక్షలు తిరిగి ఇవ్వాలని స్వాతికి సూచించారు . దీనికి స్వాతి ఒప్పుకుంది..” అసలు ఆ పది లక్షలు ఎక్కడ ఉన్నాయి? ఎలా నువ్వు వాళ్లకు తెచ్చిస్తావ్? ఇప్పుడు వాళ్లు భూమ్మీద బతికి లేరు. నువ్వు డబ్బులు ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నావని” వీరభద్రం స్వాతిని నిలదీశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే అంతకుముందు నందిని పై హత్యాయత్నం జరగడంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

సాయిరాం తండా వాసులు ఒత్తిడి చేయడంతో..

స్వాతి తో వీరభద్రం సహజీవనం చేస్తున్న నేపథ్యంలో.. డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత అతనిపై పడింది. సాయిరాం తండావాసులు కూడా పదేపదే వీరభద్రానికి ఫోన్ చేయడంతో.. అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. ఇదే క్రమంలో స్వాతి కూడా తనని పెళ్లి చేసుకోవాలని వీరభద్రాన్ని కోరడం మొదలుపెట్టింది. దీంతో వీరభద్రం ఈనెల 9న స్వాతిని హత్య చేశాడు. తన తల్లితో కలిసి సమీపంలో ఉన్న తన పత్తి చేనులో పెద్ద గోతి తీసి పాతిపెట్టాడు. ఆ తర్వాత ఏమి తెలియని వాడిలా తండాలో తిరుగుతున్నాడు. స్వాతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు సాయిరాం తండా వాసులు డబ్బుల గురించి డిమాండ్ చేయడంతో వీరభద్రం తెలివిగా బుకాయించాడు. ఇదే విషయాన్ని సాయిరాం తండా బస్సులు పోలీసులకు తెలియజేయడంతో.. అసలు వ్యవహారం వెలుగు చూసింది. మొత్తంగా ఈ ఎపిసోడ్లో స్వాతి విచ్చలవిడి వ్యవహార శైలి వల్ల రెండు కుటుంబాలు సర్వనాశనమయ్యాయి. చివరికి ఆమె జీవితం కూడా అర్ధంతరంగా ముగిసింది. అందుకే పెద్దలు డబ్బు కోసం అడ్డదారులు తొక్కొద్దు. అత్యాశకు పోయి ప్రాణాలు కోల్పోవద్దని చెబుతుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular