UK-Return Software Engineer: అతడు ఉన్నత చదువులు చదివాడు. లండన్ నగరంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు కొడుకు ఉన్నతిని చూసి మురిసిపోతున్నారు. త్వరలోనే అతడికి పెళ్లి చేయాలని భావించారు. కానీ అతడు తీసుకున్న నిర్ణయం వారి జీవితాలను ఒక్కసారిగా మార్చేసింది..
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి రాజారెడ్డి, రాజవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమార్ రెడ్డి పేరు శ్రీకాంత్. లండన్ నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఆరు సంవత్సరాల నుంచి ఇతడు ఒక యువ తిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో.. శ్రీకాంత్ కు ఆమె ఫోన్ చేసింది. స్వదేశానికి రావాలని చెప్పింది. దీంతో శ్రీకాంత్ సరిగా అయిదు నెలల క్రితం ఇండియాకు వచ్చాడు.తాము ప్రేమించుకుంటున్నామని.. పెళ్లి చేయాలని ఆ యువతి ఇంటికి శ్రీకాంత్ వెళ్ళాడు. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు శ్రీకాంత్తో పెళ్లికి ఒప్పుకోలేదు.
శ్రీకాంత్తో పెళ్లి చేయడానికి ఒప్పుకొని ఆ యువతి తల్లిదండ్రులు మరొక యువకుడితో ఈ నెల ఏడున వివాహం జరపడానికి ముహూర్తం నిర్ణయించారు. దీంతో శ్రీకాంత్ ఈనెల ఆరో తేదీన పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు తమ నుంచి ఆర్మూర్లో ఓ ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆసుపత్రిలో బాధితుడి వాంగ్మూలం సేకరించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈనెల 27న చికిత్స పొందుతూ శ్రీకాంత్ చనిపోయాడు.
శ్రీకాంత్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం రాత్రి యువతి ఇంటి పైన దాడికి ప్రయత్నించారు.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆ గ్రామానికి చెందిన వారంతా ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించడానికి వచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో శ్రీకాంత్ మృతదేహం ఉన్న ఫ్రీజర్ ను వాహనం పైకి ఎక్కించారు. ఈ క్రమంలో ఏసిపి సంఘటన స్థలానికి చేరుకొని శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని సర్ది చెప్పారు.