Homeక్రైమ్‌Stealing Bikes: రీల్స్‌ కోసం బైకుల దొంగతనం ఏకంగా 9 వాహనాలు ఎత్తుకెళ్లారు.. ఇలా దొరికారు

Stealing Bikes: రీల్స్‌ కోసం బైకుల దొంగతనం ఏకంగా 9 వాహనాలు ఎత్తుకెళ్లారు.. ఇలా దొరికారు

Stealing Bikes: ఆండ్రాయిడ్‌ ఫోన్లు వచ్చాక, ఇంటర్నెట్‌ చౌకగా మారాక.. సోషల్‌ మీడియాకు డిమాండ్‌ పెరిగింది. వివిధ యాప్స్‌లో రీల్స్‌ చూస్తూ కొందరు ఎంజాయ్‌ చేస్తుంటే కొందరు రీల్స్‌ చేస్తూ వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారు. తమ టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడానికి ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమలోని కళను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది సక్సెస్‌ కూడా అయ్యారు. అయితే.. ఇక్కడ ఇద్దరు యువకులు.. సోషల్‌ మీడియా రీల్స్‌ కోసం తమలోని చోర కళను కూడా బయటకు తీశారు. రీల్స్‌ చేయడానికి ఏకంగా ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లారు.

బైక్స్‌పై స్టంట్స్‌ చేస్తూ..
తమలోని టాలెంట్‌ను అందరికీ చూపిచాలన్న తపనతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో వాటికి లైక్స్, షేర్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ట్రై చేసేందుకు తమలో దాగి ఉన్న చోర కళను వెలికి తీశారు. వివిధ బైక్‌లపై స్టంట్స్‌ చేస్తూ రీల్స్‌ చేయడానికి వాళ్లదగ్గర బైక్‌లు లేవు. దీంతో తమ కంటపడిన మంచిబైక్‌లను ఎత్తుకెళ్లి వాటిపై రీల్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఇలా చేసిన రీల్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి మురిసిపోతున్నారు.

ఎట్టకేలకు పోలీసులకు చిక్కి..
అయితే ఈ బైక్‌ చోరులు ఎవరో తెలియక ఇన్నాళ్లూ పోలీసులు తలలు పట్టుకున్నారు. కానీ సోషల్‌ మీడియాలో వీరి రీల్స్‌ చూసిన కొందరు బైకుల సమాచారం పోలీసులకు ఇచ్చారు. దీంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నవ్వులు తెచ్చే నిజాలు..
ఇక ఇద్దరినీ పోలీసులు విచారణ చేయగా, తమకు దొంగతనం చేయాలనే ఉద్దేశం లేదని, కేవలం రీల్స్‌ కోమే ఇలా బైకులు తీసుకెళ్లామని చెప్పారు. దొంగతనం చేసేవాళ్లం అయితే బైకులు ఇప్పటికే అమ్మేసేవారం కదా అని లాజిక్‌ మాట్లాడారు. ఇదిలా ఉంటే.. ఈ యువకులు బైకులపై ప్రమాదకర రీతిలో స్టంట్స్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా బైకులు నడుపుతున్నందుకు మరో కేసు కూడా పెట్టారు. అంతే కాకుండా ఈ ఇద్దరూ ప్రమాదకరం స్టంట్ తో చేసిన ఓ రీల్‌ను కూడా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌ అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version